Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఆత్మాహుతి దాడిలో 12మంది మృతి

Hero Honda Chowk falls to fly over

కాబుల్‌: ఆత్మాహుతి దాడిలో 12మంది మృతి చెందిన సంఘటన సోమవారం అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో చోటు చేసుకుంది. ఈ ఆత్మాహుతి దాడిలో మరో 30 మందికి పైగా గాయపడ్డారు. రూరల్‌ రిహాబిలిటేషన్‌ అభివృద్ధి శాఖ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద  ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పై  పోలీస్‌ ప్రతినిధి హష్మత్‌ మాట్లాడుతూ…‘ పునరావాస కేంద్ర ప్రధాన ద్వారం వద్ద జరిగిన ఈ ఘటనలో చనిపోయిన వాళ్లలో మహిళ ఉద్యోగులు, పిల్లలే ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. రంజాన్‌ మాసం కావడంతో ఉద్యోగులందరూ మధ్యాహ్నం ఒంటిగంటకే ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఆ ఘటన జరిగిందని చెప్పారు. బాంబులు కలిగిన ఓ సాయుధుడు ప్రధాన ద్వారం గుండా లోపలికి చొరబడి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు,ఆరోగ్యశాఖ అధికారులు..క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Comments

comments