Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరి మృతి

Car-Accident

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోమరబండ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments