Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

రాష్ట్రానికి 2 జాతీయ అవార్డులు

గ్రామీణాభివృద్ధి శాఖలో రెండు స్వయం సహాయక సంఘాలకు కేంద్రం ప్రదానం

Narendra-Singhహైదరాబాద్, న్యూఢిల్లీ : గ్రామీణాభివృద్ధి శాఖలో తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. చక్కటి పనితీరుతో పాటు ప్రతిభను, ప్రగతిని కనబరిచినందుకు రాష్ట్రానికి చెందిన రెండు స్వయం సహాయక సంఘాలకు ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సోమవారం కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్వయం సహాయక సంఘం సభ్యులకు ప్రధానం చేశారు. ఈ అవార్డు కింద కేంద్రం లక్ష రూపాయల నగదు బహుమతిని ఇచ్చింది. కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి స్వయం సహాయక సంఘం, వరంగల్ జిల్లాకు చెందిన ముదిరాజ్ మహిళ స్వయం సహాయక సంఘాలకు ఈ అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘానికి చెందిన సభ్యురాలు నజీమాకు మాట్లాడే అవకాశం దక్కింది. ఈ సంధర్భంగా నజీమా స్పందిస్తూ ఒక్క రూపాయితో పొదుపు ప్రారంభించి ఈ రోజు సమాజంలో ఉన్నత స్థాయిలో బతుకుతున్నామన్నారు. అప్పు దొరకని పరిస్థితుల్లో పొదుపు సంఘాల నుంచి అప్పు తీసుకుని జీవనం కొనసాగించామన్నారు.
ముస్లిం మహిళగా బయటకు వెళ్లలేని పరిస్థితులు మొదట్లో ఉండేవన్నారు. స్వయం సహాయక సంఘంలో చేరి పేదరికాన్ని జయించానని చెప్పారు. జాతీయస్థాయి వేదికపై మాట్లాడే అవకాశం రావడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు. తీసుకున్న అప్పుతో గొర్రెలు, బర్రెలు, ఆటో, స్థలాలు కొన్ని ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నానన్నారు. స్వయం సహాయక సంఘాల్లో చేరడం ద్వారా కలిగే లాభాలను వివిధ రాష్ట్రాల్లో వివరిస్తూ నెలకు రూ.45వేలు సంపాదిస్తున్నాని చెప్పారు. మా పిల్లలు ఉన్నత విద్యనభ్యసించారన్నారు. ఒకరు ఆర్మీలో చేరాడని తెలిపారు. ఒకప్పుడు నేలపై నుంచి విమానం చూసి సంబరపడే వారమని ఇప్పుడు విమానాల్లో ప్రయాణిస్తున్నామన్నారు. దేశంలో స్వయం సహాయక సంఘాల పనితీరులో తెలంగాణ ముందుందని చెప్పారు.

Comments

comments