Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Two Persons Dies In different accidents In Rangareddy

శంషాబాద్ ః  హైదరాబాద్ -బెంగళూర్ జాతీయ రహదారిపై  ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన  సంఘన శనివారం రాత్రి ఆర్‌జిఐఏ పోలీసు స్టేషన్ పరిధిలోని గగన్‌పహడ్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. అయితే మృతుడి వద్ద స్పెండర్ బైక్ పడి ఉండడంతో వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తునట్లు తెలిపారు. బైక్ నెంబన్ ఆధారంగా మృతుడు ఎవరు అనేది తెలుసుకొవడానికి యత్నిస్తునట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

       విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం శంషాబాద్ ఆర్‌జిఐఏ పోలీసు స్టేషన్ పరిధిలో గగన్‌పహడ్ గ్రామంలోని పారిశ్రామిక వాడలోని ప్రయాగ్ న్యూట్రి ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చాక్లేట్ కంపెనీలో చోటు చేసుకుంది. ఆర్‌జిఐఏ పోలీసులు తెలిపిన వివరాల చాక్లేట్ కంపెనీకి సరుకు రవాణా చేసేందుకు లారీ వచ్చింది. అయితే కంపెనీ సమీపంలో విద్యుత్ తీగలు కిందకి ఉండడంతో అ తీగలు లారీకి తగులుకొవడంతో లారీలో ఉన్న క్లీనర్ అజంఖాన్ షాక్ తగిలింది. దీంతో అజంఖాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రాజస్ధాన్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్ధలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. అయితే మృతికి కారణం కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం అంటూ స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలను సరి చేయించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అన్నారు.

Comments

comments