Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఆర్టీసి బస్సు ఢీకొని ఇద్దరు మృతి

Two Persons Dies In Road Accident in Kodad
కోదాడక్రైమ్‌ః కోదాడ పురపాలక సంఘ పరిధిలో శ్రీరంగాపురం దగ్గర శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో హైదరాబాద్ నుండి పాలకొల్లు వైపు వెళుతున్న బోలోరో డి వైడర్‌ను ఢీకొని ఫల్టీ కొట్టింది. ఫల్టీ కొట్టిన తదుపరి వారు లేచి తమ సెల్‌ఫోన్స్ కోసం వెతుకుతుండగా విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళుతున్న ఏలూరుకు చెందిన ఆర్టీసి బస్సు ఢీకొనడంతో అబ్దూల్‌మజీద్ అక్కడికక్కడికే మృతి చెందాడు. కొండా ఆదిశేషిరెడ్డి అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.కోదాడ పట్టణ ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమలపల్లి గ్రామానికి చెందిన అబ్దూల్‌మజీద్ కొంతకాలంగా డ్రైవర్ వృత్తి చేస్తున్నారు. అబ్దూల్‌మజీద్ మరియు ఆదిశేషిరెడ్డి ఇద్దరు కలిసి బోలోరో వాహనంలో పాలకొల్లు వెళ్తున్నారు. మార్గమధ్యలో కోదాడ వద్ద వారు ప్రయాణిస్తున్న బోలోరోకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అబ్దూల్‌మజీద్ తోపాటు  కొండా ఆదిశేషిరెడ్డి కూడా మృతి చెందారు. కొండా ఆదిశేషిరెడ్డి బంధువైన మస్తాన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

Comments

comments