Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Two Persons Dies In Road Accident In Sangareddy

పుల్‌కల్: మండలంలోని శివ్వంపేట గ్రామ శివారులోని సంగారేడ్డి-నాందేడ్ అకోలా 161వ జాతీయ రహాదారిపై లారీని ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చింతమనేని ప్రసాద్‌రావ్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి….వేడికోల్ గ్రామానికి చెందిన బేగరి నాగరాజు(25) అతని స్నేహితుడు బేగరి అశోక్ ఇద్దరు కలిసి బైక్‌పై సంగారెడ్డి వైపు నుండి స్వగ్రామానికి వెళ్తున్నారు. శివ్వంపేట వద్ద ముందు నుండి వెళ్తున్న లారీని దాటి వెళ్లే క్రమంలో బైక్ అదుపు తప్పి లారీ వెనుక టైర్ల కింద పడి బేగరి నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న అశోక్ కాలు విరిగి తీవ్ర గాయాలైయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీతో సహా పారిపోయే ప్రయత్నం చేయగా రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులు గమనించి లారీని వెంబడించి కీలోమీటరు దూరంలో పట్టుకున్నారు. శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పుల్‌కల్ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగ అందోల్ మండలం అన్నా సాగర్ వద్ద చండురు గ్రామానికి చెందిన దారయ్య (30) జోగిపేట నుండి శంకరంపేట వైపు వెళ్తున్న ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

Comments

comments