Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కేంద్ర మంత్రికీ తప్పని ఈవ్ టీజింగ్!

Union Minister Anupriya Patel becomes a victim of eve-teasing

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌కు సైతం ఈవ్ టీజింగ్ తప్పలేదు. ఆమె తన లోక్‌సభ నియోజక వర్గం మీర్జాపూర్‌లో కార్యక్రమాలకు హాజరై వారణాసికి తిరిగొస్తుండగా నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన ముగ్గురు ఆమె వాహనాల శ్రేణిని దాటారు. దాంతో ఆమె భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించారు. కానీ నిందితులు వారి హెచ్చరికలను లెక్కచేయకుండా పటేల్‌పై అసభ్యకర వ్యాఖ్యానాలు చేయడమేకాక, భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై వారణాసి ఎస్‌ఎస్‌పి ఆర్.కె. భరద్వాజ్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ముగ్గురి ఆచూకీ తెలుసుకోడానికి గాలింపు మొదలెట్టారు. ఇప్పుడు ఆ ముగ్గురిని మీర్జామురాద్ పోలీసులు అరెస్టు చేయడమేకాక, వారి కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments