Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అమానుషం.. పసికందును వదిలి వెళ్లారు…

Baby Died after Woman gives birth in Toilet on Krishna Express

మేడ్చల్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలి వెళ్లిన అమానుష ఘటన నాచారంలో జరిగింది. నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లడంతో చిన్నారిని ఎలుకలు కొరికేశాయి. దాంతో పసికందుకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్లిన స్థానికులకు చిన్నారి ఏడుపు వినిపించడంతో వెళ్లి చూశారు. వెంటనే పోలీసులతో పాటు 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది చిన్నారిని మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా చిన్నారిని వదిలి వెళ్లిన వారిని గుర్తు పట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments