Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వెజ్, నాన్ వెజ్ మార్కెట్

Veg And Non veg Market construction work

మన తెలంగాణ/గజ్వేల్ : అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం అనంతరం గజ్వేల్  నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్, ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని  పాండవుల చెరువు సుందరీకరణ పనులను క్షేత్రస్థాయిలో టూ రిజం శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పాండవుల చెరువు కట్టపై కాలినడకన నడుస్తూ పనులు పర్యవేక్షణ చేస్తూ ఇంకా చేపట్టాల్సిన పనుల నిర్మాణాలపై అక్కడికక్కడే అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూ చనలు చేస్తూ పనులు వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధునాతన స్థాయిలో నిర్మిస్తున్న మార్కె ట్ పనులపై ఆరా తీస్తూ, తొందరగా పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని మార్కెటింగ్ శాఖ అధికారులు, కాంట్రాక్టరుకు సూచనలు చేశారు. అనంతరం దేశంలోనే ఆదర్శవంతమైన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ గజ్వేల్‌లో నిర్మితమైందని, అన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన మార్కెట్‌ను ఈనెల 15వ తేదిన ప్రారంభించేందుకు సిద్ధంగా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

గురువారం సాయంత్రం వెజ్, నాన్ వెజ్, ఆడిటోరియం పనులను ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడా అధికారి హన్మంతరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌లో జరుగుతున్న అభివృద్ధ్ది పనులు మినీట్యాంక్ బండ్, పాండవుల చెరువు, ఆసుపత్రి దేశంలోనే ఆదర్శవంతంగా నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్, ఆడిటోరియాన్ని పరిశీలించి వీటిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 15వ తేదిన గజ్వేల్ ప్రజలకు అంకితం చేయనున్నారని మంత్రి పేర్కొంటూ దేశంలోనే అద్భుతంగా ఆదర్శవంతమైన తీరుగా గజ్వేల్ మార్కెట్ నిర్మాణ పనులు చేశామని మంత్రి తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే డిజైన్ చేసి స్వంత ఇళ్లు నిర్మిస్తే ఎలా పర్యవేక్షణ చేస్తారో అదే తరహాలోనే 50 ఏళ్ల పాటు ముందు చూపుతో గజ్వేల్ పట్టణ ప్రజలకు ఉపయోగపడేలా తానే స్వయంగా రూపకల్సన చేశారని మంత్రి తెలిపారు. 1500 మంది కూర్చునే వీలుగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషన్‌తో నిర్మించిన ఆడిటోరియం అద్భుతంగా నిర్మాణం జరిగిందని, పనులు చివరి దశలో ఉన్నాయని, దీంతోపాటు 200, 300 మంది కూర్చునే వీలుగా ఆడిటోరియం సౌకర్యం కూడా ఉందని, చక్కగా డిజైన్ చేసి నిర్మాణం చేపట్టారని మంత్రి వివరించారు.
అలాగే మినీ ట్యాంక్‌బండ్ పాండవుల చెరువు కట్టపై ట్రైన్ సౌకర్యం, మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్, ఫౌంటేయిన్ ఏర్పాటు చేస్తున్నట్లు పిల్లలకు, పెద్దలకు అహ్లాదం అందించేలా ఉపయోగంలోని తెస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ మేరకు సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్, పాండవుల చెరువు, ఆడిటోరియం, ఆసుపత్రి పనులపై సమీక్షించి క్షేత్ర స్థాయి లో సందర్శిచి ప్రారంభోత్సవానికి సిద్ధ్దం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Comments

comments