Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఆ ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు సరైందే….

Madras-High-Court1

చెన్నై: తమిళనాడులో 18 ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌పై మద్రాసు హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. 18 ఎంఎల్‌ఎల అనర్హతపై స్పీకర్ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ సమర్ధించారు. గతంలో ఈ కేసుపై విచారణ జరిగినప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని న్యాయమూర్తి సుందర్ వ్యతిరేకించారు. ఎంఎల్‌ఎల అనర్హతపై ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర విరుద్ధమైన తీర్పును వెల్లడించడంతోపాటు ఈ కేసును మూడో న్యాయమూర్తికి మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచీ బదిలీ చేసింది. మూడో న్యాయమూర్తి తీర్పు వెలువడే వరకు ఎంఎల్‌ఎల అనర్హతపై విచారణ కొనసాగనుంది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎంఎల్‌ఎలు అన్నాడిఎంకెలో పన్నీర్ సెల్వం వర్గం విలీనాన్ని వ్యతిరేఖించిన విషయం తెలిసిందే. దీంతో 18 ఎంఎల్ఎలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. పళనిస్వామిపై అవిశ్వాసం ప్రకటిస్తూ 18 మంది ఎంఎల్‌ఎలు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో తమపై అనర్హత వేటు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టును సదరు ఎంఎల్‌ఎలు ఆశ్రయించారు.

Comments

comments