Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

సాగుబడి..

 Water for cultivation through ponds

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: గతేడాది నల్లగొం డ జిల్లాలో వానాకాలంలో 7 లక్షల 72 వేల 920 ఎక రా ల్లో రైతులు పంటల సాగు చేశారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 8 లక్షల 78 వేల 378 ఎకరాలో సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది కంటే లక్ష ఎకరాలు అదనంగా సాగులోకి వస్తుందని భావిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీతల పనులు చేపట్టి సుమారు 834 చెరువుల్లో పనులు పూర్తి చేసినందున భూగర్భ జలాలు పెరిగి బోరు, భావుల సేద్యం విస్తరిస్తుందని అంచనా. ఇవే కాకుండా ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ ద్వారా ఉదయసముద్రం ఎత్తిపోతలకు నీరందించి దాని క్రింది చెరువుల ద్వారా భూములకు సాగునీరు అందితే మరింతగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఖరీఫ్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 లక్షల 18 వేల 572 హెక్టార్లలో వరి, 4,15,986 హెక్టార్లలో పత్తి, 32,242 హెక్టార్లలో కంది, 25,190 హెక్టార్లలో పెసర, 7380 ఎకరాల్లో మిరప, 3340 ఎకరాల్లో వేరుశనగ పంటలను సాగు చేశారు.  రైతులు విత్తనాలకు, ఎరువులకు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బిపిటి ఆర్‌ఎన్‌ఆర్, ఎండియు రకాల వరి విత్తనాలను 21వేల 991 క్వింటాళ్లను అందుబాటులో ఉంచారు.

తులసీ, నూజివీడు, కావేరి, తదితర కంపెనీల పత్తి విత్తనాలకు సంబంధించి 13 లక్షల ప్యాకెట్లను నిల్వ చేశారు. వరి విత్తనాల్లో బిపిటి లాంటి పాత రకాల వరి విత్తనాలకు కిలోకి 5 రూపాయలు, ఆర్‌ఎన్‌ఆర్ కొత్త వరి వంగడాలకు కిలోకి పది రూపాయల చొప్పున సబ్సీడీపై రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. రసాయనిక ఎరువులైన యూ రియా 25 వేల మెట్రిక్ టన్నులు, డిఏపి 6వేల మెట్రిక్ టన్నులు, పొటాష్ 4019 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్ 3600 మెట్రిక్ టన్నులు సిద్దంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. మన భూమి-మన పంట కార్యక్రమం ద్వారా పక్కాగా సాగులెక్కలను సేకరించిన అధికారులు 2018 ఖరీఫ్‌కు ప్రణాళికలు సిద్దం చేశారు. జిల్లా వ్యాప్తంగా 3,51,500 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగుచేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు  అంచనా వేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది 6.5 లక్షల హెక్టార్లలో పంటలు సాగైనట్లు అధికారుల  అంచనా. 2018 ఖరీఫ్‌లో 38,000 హెక్టార్లలో పత్తిని రైతులు సాగుచేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలను రూపొందించారు. దానికి అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకొని రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది

Comments

comments