Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

బాబ్లీ పొంగి పొర్లి 4 గేట్లు ఎత్తివేత

బాసర వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
రెండు వేల క్యూసెక్కుల నీటిని వదిలినట్లు అధికారుల ప్రకటన
ముందస్తు వరద హెచ్చరికలు జారీ

Damబాసర / ఆదిలాబాద్ / నిజామాబాద్ / మెండోరా : మహారాష్ట్రలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో బాబ్లీ ప్రాజెక్టు పొంగి పొర్లుతున్నది. దాని నాలుగు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలిపెట్టారు. బాసర వద్ద గోదావరిలోకి పెద్ద ఎత్తున నీరు చేరుతున్నది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 2 వేల క్యూసెక్యూల నీటిని వదిలినట్లు అధికారులు ప్రకటించారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై మెదటివారంలో ఎత్తివేయవలసి ఉంది. అక్కడ వర్షాలు విరివిగా కురవడంతో ముందుగానే గేట్లు తెరవాల్సి వచ్చింది. బాసర వద్ద గోదావరిలో  నీరు చూసేందుకు గ్రామస్థులు, భక్తులు ఆసక్తిగా తరలి వచ్చారు.   గోదారికి  వర ద నీరు రావడంతో బాసర ఆలయ ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి,  తహసీల్దార్ వెంకటరమణ  నది వద్దకు చేరుకొని ఘాట్లను పరిశీలించారు.  అక్కడ ఉన్న జాలర్లకు పలు సూచనలు చేయడంతోపాటు నాటు పడవలు నడపకూడదని హెచ్చరికలు జారీచేశారు. ప్రధాన ఘాట్‌వద్ద  భక్తులు స్నానం చేసేటప్పుడు ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని అధికారులకు, జాలర్లకు సూచించారు. గోదావరి నది వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీరాం సాగర్ రిజర్వాయర్‌లోకి కూడా వరద నీరు తరలివస్తోంది. ఇటీవల డెడ్ స్టోరేజీకి చేరుకున్న ఎస్‌ఆర్‌ఎస్‌పి నీటితో పూర్వ కళకళలాడడం ప్రారంభించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఖరీఫ్‌కు ముందే జలకళను సంతరించుకుంది

Comments

comments