Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

నీటి సరఫరా తీరు మెరుగుపరచాలి: కమీషనర్ రమణ చారి

Water supply should be improved: Commissioner Ramana

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో నీటి సరఫరా తీరును మరింతగా మెరుగుపరచాలని మున్సిపల్ కమీషనర్ డా. కె వి రమణ చారి సిబ్బందికి సూచించారు. గురువారం సిరిసిల్లలోని మిషన్ భగీరథ నీటి సరఫరా పథకం పనులను, గ్రేవ్‌యార్డును, స్విమ్మింగ్‌ఫూల్‌ను, పార్కులను ఆయన సందర్శించి పరిస్థితులను వాకబు చేశారు. పచ్చదనం పరిశుభ్రతతో పాటు చెట్లను నాటడం, నాటిన చెట్లను రక్షించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. నీటి ఇబ్బందులు తొలగించాలని అందుకోసం మెరుగైన నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రానున్న రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల అంటువ్యాధులు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల ధృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

comments