Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పథకాలు, కార్యక్రమాలు గడువులోగా పూర్తి చేయాలి

 Welfare Development Schemes and Programs Completed

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు గడువులోగా పూర్తి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ హరితహారం, వ్యవసాయం, ఐసిడిఎస్, ఆరోగ్యం, ఒడిఎఫ్‌పై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరి తహారంలో భాగంగా వచ్చే జూలై నెలలో 96లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికా బద్దంగా తయారుచేయాలని, అందుకు అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు నాటాలని చెప్పారు. ఈ నెల 25నాటికి రైతు పంటలకు బీమా కల్పించాలని అధికంగా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6నుండి 10వ తరగతి వరకూ జూన్ మాసం సిలబస్ పూర్తయ్యేలా చూడాలని విద్యాశాఖాధికారికి ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ఉపాధ్యాయుల ప్రతి 15రోజుల కొకసారి పునశ్చరణ తరగతులు, ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు బోధించాలన్నారు. సక్రమంగా ఉపాధ్యాయులు హాజరు అవుతున్నారా లేదా మండల ప్రత్యేక అధికారులు ఆకస్మికంగా పాఠశాలలు సందర్శించాలని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐసిడిఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూపర్‌వైజర్లు అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం సమర్పించి అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాను ఒడిఎఫ్‌గా ప్రకటించేలా ప్రతి మాసం 100గ్రామాలు ఒడిఎఫ్ చేసేలా మండల ప్రత్యేక అధికారులు కృషి చేసి వాటిని పర్యవేక్షించాలని కలెక్టర్ కోరారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ కట్కూరి దామోదర్‌రెడ్డి, డిఆర్‌ఓ రాంబాబు, సిపిఓ వెంకటనారాయణ, ఎంబి ఇఇ సురేందర్, ఆర్‌డబ్లుస్ ఇఇ కృష్ణారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments