Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు

Welfare schemes for poor people with Congress party

మన తెలంగాణ/నర్సంపేట: కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఎఐసిసి సభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని వల్లబ్‌నగర్ కాలనిలో వివిధ పార్టీలనుండి 3 వందల మంది పట్టణ అధ్యక్షులు పెండెం రామానంద్ అధ్యక్షతన బీరం భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. కేసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే రానున్న రోజుల్లో అందరికీ అన్ని విధాల న్యాయం జరుగుతందని తెలిపారు. పార్టీలో చేరిన వారిలోబీరెల్లి రవిందర్ రెడ్డి నాగెల్లి సారంగం, సూరితో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం … మండలంలోని కొత్తూర్ గ్రామంలో టిఆర్‌ఎస్ పార్టీ నుండి 17 కుటుంబాలు కాంగ్రేస్‌పార్టీలో మండల అధ్యక్షుడు శాకమూరి హరిబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరినవారు బండారి మల్లయ్య అశోక్ , రాజు, రోహిత్, రమేష్‌తో పాటు పలువురు చేరారు. నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన. తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే రైతులకున్న భూములకు పట్టాలు ఇవ్వుకుండా అసైన్డ్ భూములంటూ ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని ఎంపిపి తక్కెళ్ళపెల్లి రవిందర్ రావు, జెడిపిటిసి ఎడ్ల జగన్మోహన్ రెడ్డిసర్పంచ్ తక్కళ్లపల్లి రమేశ్ అన్నారు. రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలని మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ర్యాలీ రెవెన్యూ కార్యాలయం నుండి నిరసన ఏర్పాటు చేయడం జరుగుతుందని, కావున మండలంలోని రైతుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

Comments

comments