Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

సంక్షేమ పథకాలతో కామారెడ్డి జిల్లా ప్రగతి

Welfare schemes introduced by Chief Minister KCR

మన తెలంగాణ/కామారెడ్డి: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలతో కామారెడ్డి ప్రగతి సాగుతుందని ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కన్నుల పండగగా ఇందిరాగాంధీ స్టేడియంలో అవతరణ వేడుకులు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ హాజరై అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. జయశంకర్ సార్, తెలంగాణ తల్లి, పోలీస్ కిష్టయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించా రు. అనంతరం స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసు ల గౌరవ వందనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా విప్ వివిధ రంగాల్లో కామారెడ్డి జిల్లా ప్రగతిని వివరించారు. వ్యవసాయ రంగాన్ని తిరిగి నిలబెట్టెందుకు దశల వారిగా వివిధ పథకాలను అమలుచేస్తున్నామన్నారు. అధిక లభాలను తేచ్చె పంటలను పండిస్తు క్రాప్ కాలనిలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భుసార పరిక్షలు యాంత్రికరణతో సాగు ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 25.40 కోట్లతో సబ్సిడి యంత్ర పరికరాలను అందజేశామన్నారు.  1 లక్ష 84 వేల రైతులకు 750 కోట్ల రూపా యల పంట రుణమాఫిని అమలు చేశామన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రెపిన రైతుబందు పథకం అన్నదాతలు పండుగ చేసుకున్నామన్నారు. జిల్లాలో 2 లక్షల 42 మంది రైతులకు 196 కోట్ల రూపాయల పెట్టుబడుల సాయం అందజేశామన్నారు. 100 రోజుల్లో భుమి రికార్డుల ప్రక్షాలన దైర్యంగా పూర్తి చేశామన్నారు. జూన్ 20 లోగా మిగిలిపోయిన రైతులందరికి పాసుపుస్తకాలు చెక్కులు పంపి ణీ  చేస్తామన్నారు. పార్టు బి లొ ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న 6634 మంది రైతులకు      ఏడు వేల ఎకరాల భూమికి పట్టాలిచ్చామన్నారు. సదాశివనగర్ తహసిల్ ఆఫిసులో భుముల రిజిస్ట్రేషన్ కోసం పైలట్ ప్రాజెక్టుగా సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం ప్రారంభించామన్నారు. మిగిత 21 మండలాల్లొ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆగస్టు 15 నుండి సన్నచిన్నాకారు రైతులకు సహజ ప్రమాద మరణాలకు 5 లక్షల భిమా పథకం ప్రారంభిస్తామన్నారు . ఈ వానకాలంలో 98 వేల క్వింటాల్ల విత్తనాలను సొసైటిల ద్వారా సబ్సిడిపై సరఫరా చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోల్లొ రాష్ట్రంలో 4వ స్థానం లో ఉన్నామన్నారు. యాసంగిలో పండించిన 2 లక్షల 21 వేల మెట్రిక్ టన్నుల 352 కోట్లతో వడ్లను కొనుగోలు చేశామన్నారు. 26 కోట్ల రూ పాయలతో 90 శాతం సబ్సిడితో బిందు సేద్యం సహ యం చేశామన్నారు. 75శాతం సబ్సిడితో గొర్రెల యూ నిట్లను పంపీణి చేశామన్నారు. 5 వేల టన్నుల చేపల సంపద అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. 967 కోట్లతో నిజాంసాగర్ కాలువలను ఆదునికరించామన్నారు. 2 కోట్ల 20 లక్షలతో పోచారం ప్రాజెక్టు పను లు చెపట్టామన్నారు. 13 కోట్లతో వృద్యాప్య, విత ంతు, వికాలంగుల బీడి కార్మికుల గీతా కార్మికులకు ఎయి డ్స్, బోదకాల రోగులకు పెన్షన్లు పంపీణి చేస్తున్నామన్నారు. 2944 డబుల్ బెడ్‌రూం పథకాలు ప్రార ంభించగా 86 మంది గృహ ప్రవేశం జరుపుకున్నారని తెలిపారు. 53 కోట్లతో 11 వందల ఏకరాల భూమిని 496 లబ్దిదారులకు పంపీణి చేశామన్నారు. ఆరోగ్య లక్షి పథకం ద్వారా 7697 గర్భినిలకు బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందించమన్నారు. 11 లక్షలతో 156 మంది వికలంగులకు పరికారాలు అం దించమన్నారు. జిల్లాలో 6 మైనారిటి గురుకులలాను ప్రా రంభించామన్నారు. 502 మహిళ సంఘాలకు 22 కోట్ల రూపాయల రుణాలు పంపిణి చేశామన్నారు. ఉపాది హమి పథకంలో పని దినాలు కల్పించడంలో జిల్లా 3వ స్థానంలో ఉందన్నారు. 100 శాతం మరుగుదొడ్లు నిర్మించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథ మ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, ఎంపి బిబిపాటిల్, ఇన్‌చార్జ్ ఎస్పి శ్రీధర్‌రెడ్డి, జెసి సత్తయ్య, అధికారులు పాల్గొన్నారు.

Comments

comments