Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

మహిళల టి20 ర్యాంకులు విడుదల

t20

న్యూఢిల్లీ: ఉత్తమ టి20 బౌలర్ ర్యాంకుల్లో టిమిండియా బౌలర్ పూనమ్ యాదవ్ 3వ స్థానంలో నిలిచింది. తాజాగా మహిళల టి20 ర్యాంకులను ఐసిసి విడుదల చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ మేఘన్ స్కట్ మొదటి స్థానం దక్కించుకోగా, న్యూజిలాండ్ బౌలర్ లైగ్ క్యాస్‌పెర్క్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఉత్తమ టి20 బ్యాట్స్ విమెన్‌లో టిమిండియా హిట్టర్ హర్మన్ ప్రీత్‌కౌర్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని 7వ స్థానంలో నిలిచింది. మిథాలీ రాజ్ 6వ స్థానంలో, స్మృతి మంధాన 9వ స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విండీస్ బ్యాట్స్ విమెన్ స్టాఫ్నెల్ టైలర్ మొదటి స్థానంలో నిలువగా, కివిస్ బ్యాట్స్ విమెన్ సూజీ బేట్స్ 2వ స్థానంలో నిలిచింది.

Comments

comments