Search
Tuesday 19 June 2018
  • :
  • :

“కేకులే” ఫార్మా పరిశ్రమలో ప్రమాదం

Worker dead in Cakelay pharmaceutical industry

ఐడిఏబొల్లారం: పరిశ్రమలో కెమికల్ మిశ్రమాన్ని రియక్టర్‌లో బ్యాచ్ వేసేందకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కెమికల్ మిశ్రమం కార్మికుని పై పడి తీవ్రంగా గాయపడి సదరు కార్మికుడు మృత్యువాత పడిన సంఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి సిఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విజయవాడ ప్రాంతానికి చెందిన కొత్త ప్రసాద్(35) ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని కేకులే ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ వద్ద ఆపరేటర్‌గా గత కొంత కాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటి లాగానే శుక్రవారం పరిశ్రమకు విధులకు హాజరై పనిలో నిమగ్నమై ఉండగా రాత్రి రియాక్టర్ వద్ద కెమికల్ మిశ్రమాన్ని కలిపి బ్యాచ్ వేస్తుండగా ఒక్కసారిగా కెమికల్ ఫౌడర్ అక్కడే పని చేస్తున్న ప్రసాద్,ప్రేమ్ కుమార్ ల పై పడిండి. దీంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా , ప్రేమ్ కుమార్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. పరిశ్రమలోని తోటి కార్మికులు హుటాహుటిన నగరంలోని అసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన కొత్త ప్రసాద్ అప్పటికే మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రేమ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ మేరకు మృతుని భార్య మాదవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ సతీష రెడ్డి తెలిపారు.

గతంలో కూడా కేకులే పరిశ్రమలో ప్రమాదాలు..
కేకులే పరిశ్రమలో గతంలో కూడా పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. ఆ సమయంలో కూడా పరిశ్రమలో పని చేసే కార్మికులు మృత్యువాత పడ్డారు. అయినప్పటికి పరిశ్రమ యాజమాన్యంలో ఏవిధమైన మార్పురాకపోవడం శోచనీయమని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ యాజమాణ్యం కార్మికుల శ్రేయస్సును విస్మరించటం మూలంగానే ఇటువంటి ప్రమాదాలు తరుచు సంభవిస్తున్నట్టు స్థానికులు , కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో పరిశ్రమపై సంబంధిత శాఖా అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయివుండేవి కావని కార్మికులు తెలిపారు.

Comments

comments