Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

రాయపర్తి మండల అభివృద్ధికి కృషి

Working for the development of Rayaparthi mandal

మన తెలంగాణ/రాయపర్తి : పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకవెళ్తానని పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని కొత్తూరు రెవెన్యు గ్రామ పరిధిలోని బంధనపల్లి, ఎకె తండా ప్రజలకు కళ్యాణలక్ష్మిలబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రాయపర్తి మండలం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నందున మండలంలోని అన్ని గ్రామాలకు సిసి రోడ్లు, బిటి రోడ్లను మంజూరి చేయడం జరిగిందన్నారు. దర్దెపల్లి నుండి అన్నారం వరకు రూ. 32 కోట్లతో రెండు వరుసల రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తానన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామన్నారు.  ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచనతో ఆడపిల్లకు తోబుట్టువుగా ఉంటూ వివాహ ఖర్చులకు రూ. 1లక్ష ఇవ్వడం జరుగుతున్నదన్నారు. ఏగ్రామంలో కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గ్రామాలలోని అన్ని కుల సంఘాలను ప్రభుత్వం ఆదుకుంటున్నదని ఆయన అన్నారు. ముదిరాజ్‌లకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఋణాలు, రైతన్నలకు పంటల పెట్టుబడికి ముందస్తుగా ఎకరాకు రూ. 4వేలు, పంట ఋణాల మాఫీ కార్యక్రమం, రైతులకు బీమా పథకం వర్తింపజేస్తూ 24 గంటల నాణ్యమైన కరెంటును ఇస్తూ రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తూ కార్పొరేట్ విద్యను అందిస్తున్నదన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి టిఆర్‌ఎస్ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు సుల్తాన్ సారయ్య, కౌడగాని ఉమ, సుదర్శన్‌రెడ్డి, గ్రామస్థులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments