Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

చికెన్ బిర్యాణీ లో పురుగులు

chicken-Biryani

హుస్నాబాద్ రూరల్: చికెన్ బిర్యాణీలో పురుగులు వచ్చిన సంఘటన హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్డు లో గల లక్ష్మికాంత్ రెస్టారెంట్ లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. శుక్రవారం  మధ్యాహ్నం సమయంలో కొంత మంది యువకులు రెస్టారెంట్ కి వచ్చి బిర్యాణీ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ తీసుకున్న బేరర్ బిర్యాణీ తీసుకుని వచ్చి వారికి వడ్డించాడు . కొంత భుజించిన తరువాత బిర్యాణీలో పురుగులు కనిపించే సరికి యువకులు ఖంగు తిన్నారు. విషయాన్ని మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లిన పట్టి పట్టనట్లుగా  వ్యవహరించడంతో ఈ విషయాన్ని మన తెలంగాణ దృష్టికి తీసుకోచ్చారు. పట్టణంలో మంచి పేరు ఉన్న  రెస్టారెంట్  లోనే బిర్యాణీ లు ఈ విధంగా ఉందంటే ఇక చిన్న చిన్న బిర్యాణీ ఫాయింట్ ల సంగతి ఏంటో అని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి రెస్టారెంట్ ల, బిర్యాణీ సెంటర్ల పై ఫుడ్ ఇన్స్‌పెక్టర్ తనిఖీలు నిర్వహించి రెష్టారెంట్ లను సీజ్ చేయాలని యువకులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చలగాటమాడొద్దని హెచ్చరించారు.

Comments

comments