Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పోలీసు కొలువులకు ఆగస్టులో రాతపరీక్ష

Telangana-Policeహైదరాబాద్: తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే 18,428 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు చైర్మన్ వి.వి.శ్రీనివాస్‌రావు ప్రకటించారు. ఎనిమది నెలల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని  ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు, వీవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయ న సమాధానాలిచ్చారు. తెలంగాణ ప్రభు త్వం భారీ సంఖ్య లో భర్తీ చేస్తున్న పోలీసు ఉద్యోగాల ను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైందని తెలిపారు. ఉద్యోగ నియామకాల విషయంలో దళారులను నమ్మవద్దని, ఎటువంటి అనుమానాలు ఉన్నా పోలీసు నియామక బోర్డు హెల్ప్‌లైన్, బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు శ్రీనివాస్‌రావు తెలిపారు.

Comments

comments