Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Young Man Dies In Road Accident In Nalgonda Dist

రామన్నపేట : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి బోగారం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనంపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన నరేందర్ గొర్లకాపరిగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వరకు ఇంద్రపాలనగరంలో జీవాలను మేపి దొడ్డిలో తోలాడు. రాత్రి స్వంత గ్రామం జనంపల్లికి ఫ్యాషన్‌ ప్లస్ బైక్‌పై తిరిగి వస్తుండగా బోగారం శివారులోని హర్యానా దాబా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టడంతో తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనంను రోడ్డుపై నిలుపడంతో రాత్రి పూట కనిపించక పోవడం వల్ల తన కుమారుడు ప్రమాదానికి గురై మృతి చెందాడని నరేందర్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుని తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ బి.నాగన్న తెలిపారు.

Comments

comments