Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

రియల్ స్పైడర్‌మ్యాన్

Save-to-child

కళ్ల ముందు ప్రమాదం జరుగుతున్నా కరగని వారు కొందరు. ప్రాణం పోతుంటే అది ఎలా పోతోందో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేవారు కొందరు. ఎవరికి వారు ఇలా తమాషా చూసేవారే తప్ప ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయరు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో మనం తరచుగా చూస్తున్నాం. కాని బాల్కనీ నుంచి కిందికి జారిపోయిన చిన్నారిని కాపాడడానికి నాలుగంతస్తులు ఎగబాకి ఒక యువకుడు చేసిన సాహసం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఉత్తర ప్యారిస్‌లో ఒక చిన్నారి ఇంటి బాల్కనీ నుంచి జారిపోయి కిందకు వేలాడుతుండడంతో ఆందోళన చెందిన చుట్టుపక్కలవారు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. బాల్కని అంచునుంచి వేలాడుతున్న ఆ బాబు ఎప్పుడైనా పడి పోయేలా ఉన్నాడు. గుస్సామా వేగంగా ఒక్కో అంతస్తు ఎక్కుతూ పైకి చేరుకున్నాడు. ఆ బాబును అమాంతం లాగేసి ప్రాణాలు కాపాడాడు. కాసేపటికి వచ్చిన అధికారులు చిన్నారి సురక్షితంగా ఉన్నాడని తెలిసి ఆ యువకుడిని అభినందించి వెళ్లిపోయారు. సంఘటన జరిగిన సమయంలో చిన్నారి తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. బాబును ఒంటరిగా ఇంట్లో వదిలి పనిపై బైటికి వెళ్ళారు. తిరిగి వచ్చి విషయం తెలుసుకున్న వారు గుస్సామాకు ధన్యవాదాలు చెప్పారు.

ప్యారిస్ దేశ చిన్నారిని కాపాడిన ఆ సాహస యువకుడు ఆ దేశ పౌరుకాడు. మాలీ దేశీయుడు. బతుకుదెరువు కోసం గత సెప్టెంబర్‌లో గుస్సామా పారిస్‌కు వలస వచ్చాడు. గుస్సామా సాహసాన్ని అక్కడున్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో వైరల్‌గా మారి లక్షలాది మందికి చేరింది. స్వయాన ఉత్తర పారిస్ దేశాధ్యక్షుడు దీన్ని చూసి అభినందించడమేకాదు అతనికి తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించాడు.

Comments

comments