Search
Tuesday 19 June 2018
  • :
  • :

ఉద్యోగం లేక జీవితంపై విరక్తితో యువకుడి మృతి

Young Man Suicide Attempt Without Job
రామాయంపేట :ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం లేక జీవితంపై విరక్తి చెంది ఓయువకుడు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో మంగళవారం నాడు చోటు చేసుకుంది.మృతుని కుటింబీకుల వివరాల ప్రకారం.. మిరిదొడ్డి మండల జంగంపల్లి పంచాయితీ పరిధిలోని హల్మాజీపూర్ గ్రామానికి చెందిన గుడ్ల నర్సయ్య లక్ష్మిల కుమారుడు  నరేశ్(25) డిగ్రీ వరకు చదువుకున్నాడు. కాగా ఇతను గత నాలుగు రోజుల క్రితం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలోనే నగరానికి వెళ్లి తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యి మార్గ మధ్యలో రామాయంపేట మండలంలోని తొనిగండ్లలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు.  స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులుఅక్కడికి వెళ్లి పరిశీలించగా బ్యాగుతో పాటు అతని వద్ద ఓ చీటి దొరికింది.అందులో నా చావుకు నేనే కారణం అని రాసి ఉంది. ఈ మేరకు పోలీసులు మృతుని బంధువులకు సమాచారం అందించగారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. పంచనామా అనంతరం వారి తల్లిదండ్రుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేట ఎస్‌ఐ మహేందర్ తెలిపారు.

Comments

comments