Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

రోడ్డు కోసం యువకుని ఆత్మహత్యాయత్నం

Young man To suicide attempt for road
జైపూర్‌: తమ గ్రామంలోని వీధికి సిసి రోడ్డు నిర్మించాలంటూ ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొనని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని నర్వా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం… ముదిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని నర్వాలో సిఎస్‌ఆర్ నిధుల కింద కాంట్రాక్టర్ గ్రామంలోని వీధులలో సిసి రోడ్డులు నిర్మిస్తున్నారు. గ్రామంలోని దూట నాగరాజు అనే యువకుడు తమ వీధికి సిసి రోడ్డు నిర్మించాలంటూ కాంట్రాక్టర్‌ను గత నెల రోజులుగా విన్నవిస్తున్నప్పటికి ఆ కాంట్రాక్టర్ రోడ్డు వేయడం కుదురదని చెప్పడంతో కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగి యువకుడు పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే స్థానికులు గమనించి 108లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునున్నట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments