Home జాతీయ వార్తలు మోగిన లోక్‌సభ ఎన్నికల భేరీ

మోగిన లోక్‌సభ ఎన్నికల భేరీ

sunil aroraఏప్రిల్ 11- మే 19, ఫలితాలు : మే 23

మొత్తం 7 దశలు, తక్షణం కోడ్ అమలు, ఎపి, అరుణాచల్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు కూడా
అంతటా వివి ప్యాట్‌లు, కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలే : షెడ్యూల్ ప్రకటించిన సిఇసి

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం అయ్యే ఎన్నికల ప్రక్రియ మే 23న ఫలితాల వెల్లడితో ముగుస్తుందని చెప్పారు. ఏప్రిల్ 11నే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయని వెల్లడించారు. లోక్‌సభతో పాటే ఎపి, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అసెంబ్లీ రద్దు అయిన జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదని సిఇసి అరోరా తెలిపారు.

Lok Sabha Electionsన్యూఢిల్లీ : లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఏప్రిల్ 11వ తేదీనుంచి ప్రారంభం అయ్యే ఈ ఎన్నికలు ఏడు దశలలో జరుగుతాయి. భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం అయ్యే ఎన్నికల ప్రక్రియ మే 19తో ముగుస్తుందని చెప్పారు. ఏప్రిల్ 11నే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయని వెల్లడించారు. ఇక ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన ఉంటుంది. లోక్‌సభతో పాటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అసెంబ్లీ రద్దు అయిన జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదని సిఇసి అరోరా తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆదివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులోకి వస్తున్నట్లుగా భావించుకోవల్సి ఉంటుందని వెల్లడించారు.

గత లోక్‌సభ ఎన్నికల దశలో తొమ్మిది లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పుడు ఈ సంఖ్యను పది లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. 543 మంది సభ్యుల లోక్‌సభకు దాదాపు 90 కోట్ల మంది అర్హులైన ఓటర్లు అధికారిక లెక్కల ప్రకారం నమోదు అయి ఉన్నారు. ఈసారి దాదాపుగా రెండు కోట్ల మంది కొత్త ఓటర్లు ( 1819 సంవత్సరాలు) ఎన్నికలలో ఓటుకు అర్హులుగా జాబితాలలోకి చేరారని అరోరా తెలిపారు. అయితే ఈ కొత్త ఓటర్ల సంఖ్య ఇంకా పెరగవచ్చునని, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకూ కూడా ఎన్నికల జాబితాలకు సవరణలు చేర్పులు ఉంటాయి కాబట్టి అప్పటికీ ఈ కొత్త ఓటర్ల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఈసారి ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రాయల్ (వివిప్యాట్) వినియోగంలోకి వస్తుందని ఎన్నికల ప్రధానాధికారి అరోరా తెలిపారు. వివిధ దశల పోలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పోలింగ్ తేదీలు ఇవి

తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11, రెండో దశ ఏప్రిల్ 18, మూడో దశ ఏప్రిల్ 23. నాలుగో దశ ఏప్రిల్ 29. ఐదో దశ మే 6. ఆరో దశ మే 12, ఏడవ దశ మే 19. ఇక నాలుగురోజుల తరువాత మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.

దశల వారీగా ఎన్నికల స్థానాలు

తొలిదశలో 61 నియోజకవర్గాలు, రెండో దశలో 97, మూడో దశలో 115, నాలుగో దశలో 71, ఐదో దశలో 51, ఆరో దశలో 59, ఏడో దశలో 59 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.
కోడ్ తక్షణ అమలు
తక్షణం కోడ్ అమలులోకి వచ్చినందున దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఎటువంటి పాలసీ ప్రకటనలకు దిగరాదని , ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పాల్పడరాదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిర్థిష్టంగా అంతా పాటించాల్సి ఉంటుందని సిఇసి తెలిపారు. ఇక సామాజిక మాధ్యమంలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి అవసరం అని, వీటిని తాము క్లియర్ చేయాల్సి ఉంటుందన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రకటన సమయానికి ముందు మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 81. 48 కోట్ల మందిగా ఉంది. అయితే తరువాత తుది ఓటర్ల సంఖ్య 83 కోట్లు దాటిందని అరోరా వివరించారు.

ఎన్నికల సన్నద్ధత నిర్వహణపై అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘాలు , ప్రభుత్వాధికారులతో పలు దఫాలుగా విస్తృత సమావేశాలు నిర్వహించిన తరువాత , శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించుకుని ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించినట్లు తెలిపారు. దేశంలో పండుగలు, విద్యార్థుల పరీక్షలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీలను ఖరారు చేసినట్లు తెలిపారు. వాతావరణం, పంటకోతలను దృష్టిలో పెట్టుకున్నట్లు, ఓటర్లు వేసవి తాపానికి గురి కాకుండా మంచినీరు ఇతరత్రా సౌకర్యాలు కూడా కల్పించేంపకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగానికి 12 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి ఉంటుంది. పోలింగ్‌కు ముందు ఐదు రోజుల ముందు ఓటర్లకు పోలింగ్ చిట్టీలను పంపిణీ చేస్తారని అరోరా చెప్పారు.
ఎపి , తెలంగాణలలో ఏప్రిల్ 11 ఎన్నికలు
నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఏప్రిల్ 11న జరుగుతాయి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ,లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీనే ఒకే దశలో పోలింగ్ ఉంటుందని, తెలంగాణలో కూడా ఎంపి స్థానాలకు ఇదే తేదీన పోలింగ్ ఉంటుంది. ఒకే ఒక్క దశలోదశలో ఎపిలో పాతిక స్థానాలకు, తెలంగాణలో 17 స్థానాలకు పోలింగ్ ఉంటుంది.

ఓటును తెలుసుకో ఇలా…
1950 టోల్‌ఫ్రీ నెంబరు
దేశంలో మొత్తం పది లక్షల పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల కోసం 1950 టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. దీనితో వారు తమ ఓటు స్థితిని తెలుసుకోవచ్చు.

ఏ దశలో ఏయే రాష్ట్రాల్లో ఎన్నికలు

మొదటి దశ: ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), అరుణాచల్ ప్రదేశ్ (2), అసోం (5), బీహార్ (4), ఛత్తీస్‌గఢ్ (1), జమ్మూ కశ్మీర్ (2), మహారాష్ట్ర (7), మణిపూర్ (1), మేఘాలయ (2), మిజోరం (1), నాగాలాండ్ (1), ఒడిశా (4), సిక్కిం (1), త్రిపుర (1), ఉత్తర్‌ప్రదేశ్ (10), ఉత్తరాఖండ్ (5), పశ్చిమ బెంగాల్ (2), లక్షద్వీప్ (1), అండమాన్ నికోబార్ (1)

రెండో దశ: జమ్ముకశ్మీర్ (2), అసోం (5), బిహార్ (5), ఛత్తీస్‌గఢ్(3), కర్ణాటక(14), మహారాష్ట్ర (10), మణిపూర్ (1), ఒడిశా (5), తమిళనాడు (39), త్రిపుర (1), ఉత్తర్‌ప్రదేశ్ (8), పశ్చిమ్ బెంగాల్ (3), పుదుచ్చేరి (1)

మూడో దశ: అసోం (4), బిహార్ (5), ఛత్తీస్‌గఢ్ (7), గుజరాత్ (26), గోవా (2), జమ్ముకశ్మీర్ (1), కర్ణాటక (14), కేరళ (20), మహారాష్ట్ర (14), ఒడిశా (6), ఉత్తర్‌ప్రదేశ్ (10), పశ్చిమ్‌బెంగాల్ (5), దాద్రానగర్ హవేలీ (1), డామన్ డయ్యూ (1)

నాలుగో దశ: బీహార్ (5), జయూ ్మకశ్మీర్ (1), జార్ఖండ్ (3), మధ్యప్రదేశ్ (6), మహారాష్ట్ర (17), ఒడిశా (6), రాజస్థాన్ (13), ఉత్తర్‌ప్రదేశ్ (13), పశ్చిమ్‌బెంగాల్ (8)

ఐదో దశ: బిహార్ (8), జమ్మూకశ్మీర్ (2), మధ్యప్రదేశ్ (7), జార్ఖండ్ (4), రాజస్థాన్ (12), ఉత్తర్‌ప్రదేశ్ (14), పశ్చిమబెంగాల్ (8)

ఆరో దశ: బిహార్ (8), హర్యానా (10), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), ఉత్తర్‌ప్రదేశ్ (14), పశ్చిమబెంగాల్ (8), ఢిల్లీ (7)

ఏడో దశ: బీహార్ (8), జార్ఖండ్ (3), మధ్యప్రదేశ్ (8), పంజాబ్ (13), పశ్చిమ బెంగాల్ (9), చండీగఢ్ (1), ఉత్తర్‌ప్రదేశ్ (13), హిమాచల్ ప్రదేశ్ (4)

2019 Lok Sabha Elections dates announced