Search
Sunday 23 September 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి

Pak : 20People were Killed in Road Accident

ఇస్లామాబాద్ : పాక్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కోహట్ జిల్లా సమరాయ్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న బస్సును ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

20People were Killed in Road Accident

Comments

comments