Search
Thursday 15 November 2018
  • :
  • :

కాల్‌సెంటర్ స్కామ్‌లో భారతీయులకు జైలుశిక్ష

call-center-scam1

న్యూయార్క్ : అమెరికాలో ఒకేసారి 21 మంది భారతీయ సంతతివారు దోషులుగా ఖరారయ్యారు. భారీ స్థాయిలో జరిగిన ఒక కాల్‌సెంటర్ స్కామ్‌లో వీరికి శిక్షలు విధించారు. వేలాది మంది అమెరికన్లను మోసం చేసి, కోట్లాది డాలర్ల మేర స్వాహా చేశారనే అభియోగాలపై వీరిపై విచారణ జరిగింది. అభియోగాల స్థాయిని బట్టి వీరికి నాలుగేళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ శిక్షలు విధించారని యుఎస్ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ శనివారం తెలిపారు. ఒకేసారి ఇంత మందికి గరిష్ట శిక్షలు విధించడం ఇదే తొలిసారి అని వివరించారు. భారత్‌కు చెందిన బహుళ స్థాయి కాల్‌సెంటర్‌పై మోసం పలు అక్రమాల దిశలో వచ్చిన ఆరోపణలపై విచారణ తరువాత శిక్షలను నిర్థారించినట్లు వెల్లడించారు.

అమెరికాలో శిక్షా కాలం తరువాత దోషులలో పలువురిని తిరిగి ఇండియాకు పంపిస్తారని అటార్నీ జనరల్ తెలిపారు. అమెరికా ప్రజలను మోసాల నుంచి రక్షించే దిశలో తీసుకుంటున్న చర్యలలో ఇది తమకు దక్కిన కీలక విజయం అని వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి వయస్సు మీదపడ్డ అమెరికన్లను, చట్టబద్ధంగా ఉండే ఇమ్మిగ్రేంట్లను లక్షంగా చేసుకుని ఈ తీవ్రస్థాయి బెదిరింపులు, మనీలాండరింగ్ అక్రమలకు పాల్పడ్డారని సెషన్స్ కోర్టు తెలిపింది. ఈ అంతర్జాతీయ స్థాయి క్రిమినల్ వలయం తమ బూటకపు ప్రచారంతో, బెదిరింపులతో, తప్పుడు డబ్బుల లావాదేవీలతో భారీ స్థాయిలో టెలీఫ్రాడ్ స్కీంలకు పాల్పడిందని , బాధితులకు న్యాయం చేసే దిశలో చర్యలు చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Comments

comments