Home తాజా వార్తలు సిద్దిపేట జిల్లాలో 21 పంచాయతీలు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలో 21 పంచాయతీలు ఏకగ్రీవం

21 panchayats unanimous in Siddipet district
సిద్దిపేట: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట డివిజన్‌లోని 9 మండలాల్లో 21 మంది సర్పంచులు, 317 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో 186 గ్రామపంచాయతీలు, 1,712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇందులో 21 సర్పంచ్, 302 వార్డు స్థానాలు ఏకగ్రీవం కావటంతో 165 గ్రామపంచాయతీలు, 1,395 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగతా 165 సర్పంచ్ స్థానాలకు 694 మంది అభ్యర్థులు, 1,395 వార్డు స్థానాలకు 4,082 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఏకగ్రీవాలైన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నిధులు భారీగా రానున్నాయి. 21 గ్రామాల ప్రజలు సైతం తమ ఐక్యతను చాటి ఏకగ్రీవ దిశగా అడుగులు వేశారు. రెండు, మూడు విడతల్లో సైతం అధిక గ్రామాలు ఏకగ్రీమయ్యే విధంగా అధికార పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు ప్రయత్నాలు చేపట్టారు.
సిద్దిపేట డివిజన్‌లో ఏకగ్రీవాలైన గ్రామాలు ఇవే…
సిద్దిపేట అర్బన్ మండలంలోని కిష్టసాగర్‌లో సర్పంచ్ భూసాని రాజయ్య, బూర్గుపల్లిలో కమలాకర్‌రావు, సిద్దిపేట రూరల్ పరిధిలోని ఇర్కోడ్‌లో మారెడ్డి వినీత రవిందర్‌రెడ్డి, మాచాపూర్‌లో పంజా భాగ్యలక్ష్మి బాలయ్య, ఇబ్రహీంపూర్‌లో కోడూరు దేవయ్య, సీతారాంపల్లిలో మిట్టపల్లి ఎల్లవ్వ దుబ్బయ్య, లక్ష్మిదేవిపల్లిలో బొంగరం మంజుల శ్రీనివాస్‌రెడ్డి, కోదండరాంపల్లిలో బొంగరం మౌనిక భాస్కర్‌లు ఏకగ్రీవమయ్యారు. అలాగే చిన్నకోడూరు మండలంలోని కిష్టపూర్‌లో మహాంకాళి కవిత, నంగునూరు మండలంలోని నాగరాజుపల్లిలో పాకల కల్పన, నంగునూరులో టి. మమత, జేపీ తండాలో భూక్య భిక్షపతి నాయక్, చేర్యాల మండలంలోని శభాష్‌గూడెంలో బొడ్డు స్వప్న, కొమురవెల్లి మండలంలోని రసూల్‌బాద్‌లో పచ్చిమడ్ల స్వామి, గౌరయపల్లిలో సద్ది క్రిష్ణారెడ్డి, తొగుట మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లిలో మద్దూరి రాము, గోవర్ధనగిరిలో తోయేటి ఎల్లయ్య, కాన్గల్‌లో మాధవరెడ్డి గారి ప్రేమల, మిరుదొడ్డి మండలంలోని వీరారెడ్డిపల్లిలో పన్యాల వెంకట్‌రెడ్డి, బేగంపేటలో అనసూయ, దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో పాతులోత్ పెంటవ్వలు ఏకగ్రీవం కాగా, 317 వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి.

21 panchayats unanimous in Siddipet district