Home జాతీయ వార్తలు 22.5 కోట్ల దోపిడీ

22.5 కోట్ల దోపిడీ

ఢిల్లీలో బ్యాంక్ వ్యాన్‌తో పరారీ అయిన డ్రైవర్
robberyన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తం నగదు దోపిడీ జరిగింది. రూ.22.5 కోట్లతో వెళ్తోన్న ఓ బ్యాంక్ నగదు రవాణా వ్యాన్ సహా డ్రైవర్ ఉడాయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఆగ్నేయ ఢిల్లీలోని గోవిం ద్‌పురి ప్రాంతంలో గురువారం ఈ భారీ దోపిడీ చోటుచేసుకుంది. నగదు దోపిడీ విషయాన్ని సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవింద్ పురి మెట్రోస్టేషన్ వద్దకు రాగానే తాను రిలీవ్ అయ్యేందుకు రోడ్డు పక్కన వ్యాన్‌ను ఆపాలని గార్డ్ వినయ్‌పటేల్ వ్యాన్ డ్రైవర్‌ను కోరాడు. డ్రైవర్ ప్రదీప్ శుక్లా గార్డ్ దగ్గరలోని రోడ్డు పక్కనే ఉన్న సందులో నిరీక్షి స్తానని గార్డ్‌కు చెప్పాడు. అతడు చెప్పిన ప్రకారమే వ్యాన్‌ను మూలమలు పుకు వెళ్లడాన్ని చూసిన వినయ్, కొద్ది సేపటికే ఆ ప్రాంతానికి వెళ్లాడు. అయితే, అతను అక్కడ ఎంత వెదికినా డ్రైవర్ కనిపించలేదని పోలీసులు చెప్పారు. డ్రైవర్ నగదువ్యాన్‌తో ఉడాయించిన విషయాన్ని వ్యాన్ గార్డ్ వినయ్‌పటేల్ సంబంధిత ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచి అధికారులకు సమాచా రాన్ని అందించాడు. దోపిడీ విషయాన్ని వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. మొత్తం నగదు రూ.38 కోట్లు ఉన్న నాలుగు నగదు రవా ణా వ్యాన్లను వివిధ ప్రాంతాలకు పంపించినట్టు వారు పోలీసులకు చెప్పా రు. ఆ రోజు వికాస్‌పురి బ్రాంచి నుంచి వ్యాన్‌ను ఆగ్నేయ ఢిల్లీ వైపునకు దాదాపు రూ.22.5కోట్ల మొత్తాన్ని తీసుకెళ్తున్నారని చెప్పారు. అయితే నగదు ఎంత మొత్తంలో ఉందన్న ఖచ్చితమైన వివరాలు మాత్రం నిందితు డు దొరికితేనే తెలుస్తుందని పోలీసులు వివరించారు. దోపిడీ సమాచారం అందుకున్న వెంటనే ఆగ్నేయ ఢిల్లీకి చెందిన ఇద్దరు డిఎస్‌పిల నేతృత్వం లో ప్రత్యేక నేర పోలీస్ బృందాలు నగదు వ్యాన్ దోపిడీకి గురైన ప్రాంతా న్ని జల్లెడ పట్టారు. అయితే, సంఘటనా స్థలికి సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ నుంచి నగదు వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలి పారు. వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ నగదు ఉంచిన బాక్స్‌లు లేవని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలికి చేరుకున్న మరికొందరు పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఇది దోపిడీ కేసు కాదని, నమ్మక ద్రోహంగా ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఈ దోపిడీ ఘటనతో ఉలిక్కి పడ్డ ఢిల్లీ పోలీసులు నగరంలోని చెక్ పాయింట్లు ఏర్పాటుచేసి తనిఖీలు కొనసాగించారు. నిందితుడిని పట్టుకునేందుకు నగర శివారు ప్రాంతాల లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దగ్గరలో ఉన్న సిసిటివిలలో దోపిడీ దృశ్యాలు చిత్రీకరించబడ్డాయా లేదా అన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యక్షసాక్షులను కూడా విచా రిస్తున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు పలు పోలీస్ బృందాలను రంగంలోకి దించినట్టు పోలీసులు చెప్పారు. ఢిల్లీలో ఇదే అతిపెద్ద దోపిడీ అని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. 2014 జనవ రిలో ఇక్కడి మూల్‌చంద్ ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యాపారికి తుపాకీ ఎక్కుపెట్టి రూ.7.69కోట్లు దోపిడీ చేశారని, ఆ తర్వాత ఇదే భారీ దోపిడీ అని పోలీసులు చెప్పారు.