Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

22న వస్తున్న ‘రైల్’

danushరఘువరన్ బి.టెక్, అనేకుడు, మాస్, మరియన్ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్ కథానాయకుడిగా ‘నేను శైలజ’ ఫేమ్ కీర్తి సురేష్ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రైల్’. ఆదిత్య మూవీ కార్పొరేషన్, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్ పతాకాలపై బేబి రోహిత రజ్న సమర్పణలో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ “ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు అన్ని చోట్ల నుండి చాలా మంచి స్పందన వస్తోంది. రఘువరన్ బి.టెక్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో హీరో ధనుష్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘రైల్’ ధనుష్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది. ఈనెల 22న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు. తంబి రామయ్య, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః డి.ఇమ్మాన్, సినిమాటోగ్రఫీః వెట్రివేల్ మహేంద్రన్, ఎడిటింగ్‌ః ఎల్.వి.కె.దాస్, ఫైట్స్‌ః స్టన్ శివ, మాటలుః వెన్నెల కంటి, పాటలుః వెన్నెల కంటి, సాహితి.

Comments

comments