Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

స్విస్ లో విమాన ప్రమాదం: 22మంది మృతి

22 killed in plane crash in Swiss

జ్యూరిచ్: 19మంది ప్రమాణికులతో పాటు ముగ్గురు పైలట్లతో ప్రయాణిస్తున్న జెయు-52 నంబరు విమానం కూలిపోయిన సంఘటన స్విస్ లో కాంటన్ ఆఫ్ గ్రాబుయెన్ డెన్ ప్రాంతంలోని పిజ్ సిగ్నాస్ పర్వత ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో 22మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్థానిక ఎయిర్‌లైన్స్‌ సంస్థ అయిన జెయు-ఎయిర్‌ ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు 5 హెలికాప్టర్ లు, పెద్ద సంఖయ్యలో రక్షక దళాలతో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలం సముద్ర మట్టానికి 8,038 అడుగుల ఎత్తులో ఉండటంతో రక్షక చర్యలు కష్టంగా మారాయని స్థానిక మీడియా తెలిపింది.

 

Comments

comments