Home జాతీయ వార్తలు లోయలో పడ్డ బస్సు : 22 మంది మృతి

లోయలో పడ్డ బస్సు : 22 మంది మృతి

Reasiజమ్మూ : బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిన దుర్ఘటనలో 22 మంది చనిపోగా మరో పాతిక మంది గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూలోని రియెసీలో చోటు చేసుకుంది. 45మంది ప్రయాణికులతో ఉన్న బస్సు రియెసీ సమీపంలో అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.