Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో టోర్నెడో బీభత్సం

అమెరికాలో టోర్నెడో బీభత్సం

tornado

బ్యూరీగార్డ్‌: అమెరికాలోని అలబామా రాష్ట్రాన్ని టోర్నెడో వణికిస్తోంది. ఆగ్నేయ అలబామాలో టోర్నెడో ధాటికి 23 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తుపాను ధాటికి జార్జియా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా ప్రాంతాల్లో తీవ్ర నష్టం ఏర్పడినట్లు, డ్రోన్ల సాయంతో ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి కాపాడుతున్నామని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు .  టోర్నెడో ధాటికి పలు చోట్ల ఇళ్లు, చెట్లు నెలకొరిగాయి. టోర్నెడో కారణంగా గంటకు 170 మైళ్ల వేగంతో గాలులు వీచాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. సహాయక కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇచ్చినట్లు అలబామా గవర్నర్‌ తెలిపారు.

23 dead in catastrophic tornado outbreak in Alabama