Home జాతీయ వార్తలు రెండేళ్లలో 237 పులులు మృతి…

రెండేళ్లలో 237 పులులు మృతి…

237 tigers died in two years said Environment Minister Mahesh Sharma

న్యూఢిల్లీ: గడిచిన రెండేళ్లలో దేశవ్యాప్తంగా 237 పులులు చనిపోయినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి మహేశ్ శర్మ సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. 2012 నుంచి 2017 వరకు జరిగిన పులుల మరణాల్లో… 23 శాతం వేటగాళ్ల వల్లే మృతిచెందినట్టు మంత్రి స్పష్టం చేశారు. అయినా పులుల సంఖ్యలో మాత్రం మార్పు రాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 5.8 శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016లో 122, 2017లో 115 పులులు చనిపోయినట్టు మంత్రి మహేశ్ శర్మ పేర్కొన్నారు.