Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

యువతను ఆకట్టుకునే ‘24 కిస్సెస్’

24-Kisses

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం  ‘24 కిస్సెస్’. ఈ  సినిమా ఫస్ట్‌లుక్‌కు,  హీరోయిన్ ఇలియానా  విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ‘మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా యువతను ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకుంటోంది. సిల్లీమాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అదితి మ్యాక, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌ః ఉదయ్ గుర్రాల, మ్యూజిక్‌ః జాయ్ బరువ, ఎడిటర్‌ః ఆలయం అనిల్, పాటలుః రామజోగయ్యశాస్త్రి.

Comments

comments