Home తాజా వార్తలు వడదెబ్బతో ఒకరి మృతి

వడదెబ్బతో ఒకరి మృతి

Sunstroke,

నాగర్ కర్నాల్: జిల్లాలో వడదెబ్బతో భర్త మృతిచెందగా భార్య అస్వస్థతకు గురైన ఘటన నాగర్ కర్నూల్ లోని పెద్దాపూర్ లో చోటుచేసుకుంది. భర్త శ్రీరాములు(60) భార్య కిష్టమ్మ(55) వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురైయ్యారు. పోలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నకొద్ది సేపటికే దంపతులు అపస్మార స్థితిలోకి వెళ్లారు. తల్లిదండ్రులను గమనించిన కొడుకు వెంటనే వారిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించాడు. చికిత్స పొందుతూ శ్రీరాములు చనిపోగా, భార్య కిష్టమ్మ కోలుకుంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్నిస్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం  మార్చురీకి తరలించారు.