Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఆర్మూర్ పట్టణ సుందరీకరణకు రూ. 25 కోట్ల నిధులు మంజూరు

 Armour Urban to Rs. 25 crore grants for Devlopments

మన తెలంగాణ/ఆర్మూర్: ఆర్మూర్ సుందరీకరణలో భాగంగా ఇటీవలే మంజూరైన రూ.31 కోట్ల నిధులతో పాటు మరో రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జివో కాపీని విడుదల చేసినట్లు సోమవారం ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ సిద్దుల గుట్ట గుడిపై వీధి దీపాలు, షెడ్డు నిర్మాణం, హాల్ 3 గెస్ట్ రూములు, బాత్ రూ ంలు, పార్క్ నిర్మాణాల కోసం 25 లక్షలు, గోల్‌బంగ్లా దగ్గర ఉన్న   లక్ష్మి నరసింహ దేవస్థానాని ఆదుణీకరణ పనుల కోసం 25 లక్షలు, విద్యనగర్ కాలోని ఆధునీకరణ పనుల కోసం 25 లక్షలు, జంబీహనుమాన్ దేవాలయా ఆదునీకరణ పనుల కోసం 25 లక్షలు, నల్ల పోచమ్మ గుడి ఆదునీకరణ పనులకు 25 లక్షలు, 1300 ప్లాట్ల కాలనీ ఆదునీకరణ పనులకు 25 లక్షలు, సైదాబాద్ కాలనీ ఆధునీకరణ పనులకు 25 లక్షలు, లయన్స్ క్లబ్ వెనుక గురడి రెడ్డి సంఘం ఆదునీకరణ పనులకు 25 లక్షలు, కంపెల్లి పంథా ఆధునీకరణ పనులకు 25 లక్షలు, మహాలక్ష్మి కాలనీ ఆధునీకరణ పనులకు 25 లక్షలు,పెద్దమ్మ గుడి దగ్గర ఆర్మూర్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి, 25 లక్షలు, రామాలయం ఆధునీకరణ పనులకు (వార్డు 22) 25 లక్షలు, ముస్లీం మైనారీటి షాదీఖాన (ఫంక్షన్ హాల్ ) 1 కొటి రూపాయలు, రాజరాం ఆదునీకరణ పనుల కోసం 25 లక్షలు, జర్నలిస్టు కాలనీ ఆధునీకరణ పనులకు 25 లక్షలు, రజక మండలికి 25 లక్షలు, శ్రీ శక్తి భవన నిర్మాణానికి 10 లక్షలు, టీచర్స్ కాలనీ ఆధునీకరణ పనులకు 25 లక్షలు, అరుంధతి నగర్ (వార్డు 18) ఆదునీకరణ పనులకు 25 లక్షలు, బృందావన్ కాలనీ (వార్డు 8) ఆదునీకరణ పనుల కోసం 25 లక్షలు, దేవంగా సంఘానికి 25 లక్షలు, సరస్వతి మందిర ఆదునీకరణ పనులకు 14 లక్ష లు, పద్మశాలి కమిటి కి 15 లక్షలు, అంబేద్కర్ కాలనీ ( వార్డు 11) ఆధునీకరణ పనుల కోసం 25 లక్షలు, 16వ వార్డు ఆధునీకరణ పనులకు 15 లక్షలు, మహలక్ష్మి గుడి దగ్గర హోసింగ్ బోర్డ్ కాలనీ, మల్లారెడ్డి చెరువు దగ్గర పార్క్ నిర్మాణానికి 2 కోట్ల 70లక్షలు, నిజామాబాద్ రోడ్ దగ్గర పెర్కిట్ మహిళ ప్రాంగణం దగ్గర మానస స్కూల్ దగ్గర స్వాతగ తోరాణాల నిర్మాణానికి 45 లక్షలు, స్లాటర్ హోస్ నిర్మాణానికి లేతర్ పార్క్ దగ్గర 50 లక్షలు, నూతన ప్రయాణ ప్రాంగణ నిర్మాణానికి (దోభిఘాల్, అంబేద్కర్ చౌరస్తా ఎల్.ఐ.సి బిల్డింగ్, ఎమ్మెల్యే క్యాంప్, ఆఫిస్, ఎస్. బి.హెచ్ మెయిన్ రోడ్, ఆలూరు రోడ్ దగ్గర 5 లక్షలు, నూతన మెడరన్ కూరగాయలు, మాంసాహార విక్రయ కేం ద్రాలు నిర్మాణానికి 2 కోట్లు, విద్యుత్ ఎల్.యి. డి దీపాల నిర్మాణానికి (నిజామాబాద్ రోడ్ నుండి మామిడిపల్లి చౌర స్తా వరకు) 2 కోట్లు, వ్యాయామ వాల, స్విమి ంగ్ పూల్, క్రికెట్ మైదన నిర్మాణానికి (పిప్రి డిగ్రీ కాలేజ్ దగ్గర) 2 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపి కల్వకుంట్ల కవిత, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments