Home జాతీయ వార్తలు 250 మంది అమర్‌నాథ్ భక్తులను రక్షించిన అధికారులు

250 మంది అమర్‌నాథ్ భక్తులను రక్షించిన అధికారులు

amarnath
ఖాట్మండు: అమర్‌నాథ్ కైలాస మానస స రోవర్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో చిక్కుకున్న 250 మంది భక్తులను అధికారులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీరంతా టిబెట్‌లో భారీ వర్షా ల వల్ల కదలలేని పరిస్థితిలో ఉన్నారు. మరో 119 మంది సిమికి నుంచి సుర్‌ఖేట్‌కి తరలి వెళ్లారు. భారత్ యంత్రాంగం అమర్‌నాథ్ భక్తుల కోసం నేపాల్‌గంజ్ సిమికోట్ హిల్సా ప్రాంతంలో తగిన ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఇక్కడ చిక్కుకు పోయిన భారతీయులు, భారత్ సంతతికి చెందిన వారిని ఇక్కడి నుంచి తరలించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. హిల్సా సిమికోట్ హెలికాప్టర్లలో 250 మంది భ క్తులను, 35 ట్రిప్పుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించామని భారత్ ఎంబసి ప్రకటించింది. మిగతా భక్తులను తరలించడానికి అవసరమైతే చార్టర్డ్ హెలికాప్టర్లని అద్దెకు తీసుకుంటామని తెలిపింది. ఇక్కడి వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి భక్తులను అనువైన మార్గంలో దేశానికి తరలిస్తామని ప్రకటించింది.