Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పాక్ జైలు నుంచి 27 మంది భారతీయులు విడుదల?

 27 Indians released from Pakistan jail

లాహోర్: పాక్  మాజీ క్రికెటర్ ,పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జులై 25న జరిగిన పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెహ్రీక్-ఈ -ఇన్సాఫ్ చిన్న పార్టీల మద్దతును కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.  ఆగస్టు 11న ఇమ్రాన్ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదాసీదాగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే భారత్ తో సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి.ఇందులో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే పాక్‌ జైళ్లలో మగ్గుతున్న 27మంది భారతీయులను విడుదల చేయాలని నిర్ణయించారట.భారత్ కు చెందిన 27 మంది మత్స్యకారులకు ఆగస్టు 12న కరాచీ జైలు నుంచి లాహోర్ కు తరలించనున్నారు. అనంతరం అక్కడ నుంచి వాఘా సరిహద్దుకు తీసుకొచ్చి, భారతీయ అధికారులకు అప్పగిస్తారు.

 

Comments

comments