Home జోగులాంబ గద్వాల్ జోగులాంబ జిల్లాలో 28వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు

జోగులాంబ జిల్లాలో 28వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు

Helmet

గద్వాల న్యూటౌన్ : జోగులాంబ గద్వాల జిల్లాలో బుధ వారం జాతీయ రహదారి 28వ భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. ఇందులో భాగంగా ఎస్పీ విజయ్ కుమార్ మరియు డిటిఓ లక్ష్మి అద్వర్యంలో ద్విచక్ర వాహనాలతో హెల్మెట్ల్‌ను ధరించి ర్యాలీని చేప ట్టారు. ర్యాలీలో భారీ ఆకారపు హెల్మెట్‌ను ట్రాక్టర్‌పై ఉరేగిస్తు ప్రజలకు హెల్మెట్ వల్ల కలిగే లాభల గురించి పోలీసు సిబ్బంది తేలియజేస్తు ర్యాలీ ను కోనసాగించారు. ఈ సమవేశంలో ఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతు కాలము విలువైనది ప్రాణం అంతకంటే విలువైనది మీ అజాగ్రతతో ఇత రుల ప్రాణాలతో చలగటం వద్దని మద్యం సేవించి వాహనాలు నడుపరా దని అధిక వేగం అందరికి ప్రమాదమని అన్నారు.

రాత్రులందరు లైట్స్ డిమ్ డిప్పర్ తప్పనిసరిగా కొట్టవలెను. కొట్టనియెడల ఎదురుగా వచ్చే వాహనమునకు రోడ్డు కనిపించక ప్రమాదం సంభవించును కావున రాత్రు లందు తప్పకుండ లైట్స్ డిమ్ డిప్పర్ వాడలని అన్నారు. ఈ సందర్భంగా డిటిఒ లక్ష్మి మాట్లాడుతు అందరికి తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని లేని యెడాల మా కార్యలయం నందు పోందవలనని హెల్మెట్ లను ప్రతి ఒక్కరు వాడాలని వాహనం నడిపే సమయంలో జగ్రతలు పటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాహదారులకు అధికారులు కొన్ని రహాదారి నిబంధనలను తేలియజేశారు.

* రహదారి సూత్రములను పాటించి ప్రమాదాలను అరికట్టండి.

 * కాలము విలువైనది ప్రాణము అంతకంటే విలువైనది.

* నీవే నీ కుటుంబమునకు ఆదారం అని గుర్తించుకో.

* నీ నిర్లక్షము పనికిరాదు, అతి జాగ్రతగా వాహనమును నడుపుము.

* వాహనమును నో పార్కింగ్ స్థలమునందు నిలుపరాదు.

* వాహనము మత్తు పానీయములు సేవించి నడుపరాదు.

* నో ఎంట్రీ మరియు వన్‌వే నిబంధనలను పాటించవలెను.

* ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించి ప్రమాదాలను అరికట్టండి.

* తలకు సురక్షితంగా కవచం తొడగాలి.

* పరిమితికి మించిన వేగంతో బండి నడిపితే రూ.400/లు జరిమనను విధించేదరు.

* చక్కగా బిగించియున్న మోటర్ సైకిల్ వెనుక సీటుపై ఒకే మనిషి మాత్రమే కూర్చనవలెను.

* కాపలా మనిషి లేని రైల్వె లెవల్ క్రాసిగ్ వద్ద విదిగా డ్రైవర్ రక్షణ హెచ్చారికలను పటించాలి.

* డ్రైవర్ యునిఫాంలో ఉండవలెను.