Search
Wednesday 21 November 2018
  • :
  • :

యువతలో క్రీడాసక్తికోసం 2కె రన్

2K Run for sports force in youth

మన తెలంగాణ/నిర్మల్: క్రీడాకారులను ప్రోత్సహించివారిలో నిగుడీ కృతమై ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర న్యాయ గృహనిర్మాణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్ర కర ణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒలింపిక్ డేను పురస్కరించు కొని నిర్మ ల్ పట్టణంలోని ఎస్‌టిఎర్ మిని స్టేడియంలో జిల్లా ఒలింపిక్ అసో సియే షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్‌డే కార్యక్రమాన్ని మంత్రి క్రీడా జ్యోతిని వెలిగించి 2-కె రన్‌ను ప్రారంభించి మినీస్టేడియం నుంచి స్వామి వివేకనంద విగ్రహం, కొత్తబస్టాండ్ పాతబస్టాండ్ బుధవార్‌పేట, బొయి వాడ మీదుగా విద్యార్థులు, యువకులు, పిఈటిలతో రస్ మినిస్టేడియం చేరుకుంది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన తర్వా త మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న 2కెరన్ పాల్గొన్నారు. వారందరికి మంత్రి అభినందనలు తెలిపారు. క్రీడలతో శారీర దారుఢ్యం, మానసిక ప్రశాంతత కలగడమేకాకుండా స్నేహభావం పెంపొందుతుందన్నారు. జిల్లాలోని యువత క్రీడల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాసక్తిని పెంపొందించుటకు ఆధికారులు క్రీడాకారులను చైతన్య వం తంచేసి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అయ్యన్నగారి భూమన్న, ఉపాధ్యక్షులు ప్రమోద్ చంద్రరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments