Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అసోం, పశ్చిమబెంగాల్‌లో రెండో విడత పోలింగ్ ప్రారంభం

electionsకోల్‌కతా: అసోం, పశ్చిమబెంగాల్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అసోంలోని 61 శాసనసభ స్థానాలు, పశ్చిమబెంగాల్‌లో 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 688 మంది అభ్యర్థులు తాజాగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ నెల 4న తొలిదశలో భాగంగా 65 స్థానాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇదే విధంగా 294 శాసనసభ స్థానాలున్న పశ్చిమబెంగాల్‌లో తొలి విడతలో భాగంగా 18 స్థానాల్లో తొలి దశ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Comments

comments