Home రాష్ట్ర వార్తలు గోదావరిపై 3 వంతెనలు

గోదావరిపై 3 వంతెనలు

225

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల, ఆదిలాబాద్‌లో అర్జున గుట్ట, భూపాలపల్లిలో పలుగుల వద్ద రోడ్డు బ్రిడ్జిలను మంజూరు చేసిన కేంద్రం
అటవీ ప్రాంతంలో రెండు లైన్ల రోడ్లకు అంగీకారం : మంత్రి తుమ్మల వెల్లడి

హైదరాబాద్ : రాష్ట్రానికి గోదావరి నదిపై మూడు వంతెనలను కేంద్రం మంజూరు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల, ఆదిలాబాద్ జిల్లా అర్జునగుట్ట, భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం పలుగుల వద్ద ఈ రోడ్డు వంతెనలు నిర్మాణం కానున్నాయి. వీటితో వివిధ మార్గాల మధ్య దూరం తగ్గడమే కాకుం డా రవాణాపరమైన ఇబ్బందులు తొలగనున్నాయి. ఆర్ అండ్ బి ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇఎస్‌సిలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, ఇతర చీఫ్ ఇంజినీర్లలో మంత్రి తుమ్మల సోమవారం సమీ క్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణం, నూతన కలెక్టరేట్ల నిర్మాణం వంటి అంశాలను చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అటవీ ప్రాంతాలలో ఒక్క వరుస రహదారి స్థానంలో నిబంధలను సవరించి కేంద్ర ప్రభుత్వం రెండు వరుసల రహదారులను మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లాలో మహదేవ్‌పూర్‌ముక్కునూర్‌కుకునూర్‌కాటారం రహదారి, కమాన్‌పేటముక్కనూర్ రోడ్డుతుపాకుల గూడెం, కరీంనగర్ రహదారిని కలిపే పగడపల్లికనేపల్లి రహదారులు రెండు లైన్ల రోడ్లుగా మారుతున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రస్తుత స్థితి, ఆలస్యం అవుతున్న వాటి వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగంగా గతంలో మంజూరు అయిన రూ. 1,290 కోట్ల రహదారుల పనులను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఆయా పనులను త్వరిత గతిన చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు.