Search
Friday 21 September 2018
  • :
  • :

రేపు తేలనున్నకర్నాటక భవితవ్యం…

congrss

హైదరాబాద్: కర్నాటక అధికార పీఠం ఎవరికి దక్కబోతుందన్నదానిపై మరికొన్ని గంటల్లో తెలిపోనుంది. అధికారం దక్కించుకోవడానికి రేపు బెంగళూరులోని విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్‌, జెడిఎస్‌, బిజెపిలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కాసేపట్లో హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు బెంగళూరుకు తిరుగు ప్రయాణం కానున్నారు. టి కాంగ్రెస్ నేతలు 150 వాహనాలలో కాన్వాయ్ ఏర్పాటు చేశారు.  కొంతమంది ఎమ్మెల్యేలకు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసినట్టు కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు వెల్లడించాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఊహించని మలుపు తిరుగుతున్నకన్నడ రాజకీయాలకు శనివారంతో తెరపడనుంది. కన్నడ పోలిటిక్స్ లో రేపు కైమాక్స్ ఏలా ఉండబోతుంది..? రేపటి కర్నాటక అసెంబ్లీలో ఏం జరగబోనుంది..? యడ్యూరప్ప పంతం నెగ్గుతుందా..? కాంగ్రెస్, జెడిఎస్ ల కూటమీ చక్రం తిప్పుతుందా..? మొత్తం ఈ ఎపిసోడ్ లో ప్రోటెం స్పీకర్ నిర్ణయమే కీలకం కానుంది.

Comments

comments