Home జాతీయ వార్తలు రైలు ప్రమాదం: ముగ్గురి మృతి

రైలు ప్రమాదం: ముగ్గురి మృతి

 

భువనేశ్వర్‌: ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. రాయగఢ్‌-కొరాపుట్‌ రైల్వే మార్గంలో సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఒకే లైనులో ఎదురెదురుగా వచ్చిన నిర్వహణ వ్యాన్‌, ఎక్స్‌ప్రెస్‌ రైలు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వేసిబ్బంది మృతిచెందినట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రకటించింది. ఈ ఘటనలో నిర్వహణ వ్యానులో ఒక్కసారిగా మంటలు చెలరేగాడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో కూడా రెండు జనరల్‌ బోగీలతో పాటు లగేజ్‌ బోగీలోనూ మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అయితే,  ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే తెలిపింది.

3 dead in Samaleshwari express rail accident in Odisha