Search
Wednesday 21 November 2018
  • :
  • :

సెల్ఫీ ముందు ప్రాణాలు తృణప్రాయమేనా?

3 die in accident as onlookers remain busy taking selfies in Rajasthan

జైపూర్: సెల్ఫీ అనేది ప్రస్తుతం మానవ జీవనంలో ఓ భాగమైపోయిందనే చెప్పాలి. పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు సెల్ఫీ అనేది కామన్ అయిపోయింది. దీనికోసం కొందరు ప్రాణాలకు కూడా తెగిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇంకొందరు అత్యుత్సాహంతో ప్రమాదానికి గురైన వారితో సెల్ఫీలు దిగుతుండటం చేస్తుంటారు. గాయపడిన వారికి సాయం చేయాలనే కనీస ఆలోచన లేకుండా సెల్ఫీలకు ఉపక్రమిస్తుంటారు. తాజాగా ఇలాంటి కోవలోనే ఓ అమానవీయ ఘటన రాజస్తాన్‌లోని బర్మార్‌ జిల్లాలో జరిగింది. ప్రాణం కన్నా సెల్ఫీలు తీసుకోవడమే ముఖ్యమన్నట్లు ప్రవర్తించి ముగ్గురు వ్యక్తులు చనిపోవడానికి పరోక్షంగా బాటసారులు కారణమయ్యారు.

అసలేం జరిగిందంటే… గుజరాత్‌కు చెందిన పర్మానంద్‌, చంద్రారామ్‌, జమారాం అనే ముగ్గురు వ్యక్తులు లేబర్‌ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారు. వారు పని చేసేందుకు రాజస్తాన్‌లోని బర్మార్‌కు వచ్చారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వీరిని స్కూలు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ముగ్గురు రోడ్డుపై వెళ్తున్న వారిని వారితో తమను ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడాల్సిందిగా వేడుకున్నారు. అయితే అటుగా వచ్చిన బాటసారులు రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతున్న వారితో సెల్ఫీలు దిగుతూ, వీడియోలు షూట్‌ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే ఏ ఒక్కరు కూడా వారిని మానవత్వంతో కాపాడే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు చాలా సేపటి వరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలొదిలారు.

Comments

comments