Search
Wednesday 17 October 2018
  • :
  • :

ఢిల్లీలో ముగ్గురి హత్య

3 Family Members Murdered in Delhi

ఢిల్లీ : ఢిల్లీలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున కిషన్ ఘడ్ గ్రామంలోని వసంత్‌కుంజ్‌లో జరిగింది. మిథిలేష్, ఆయన భార్య సియా, కూతురు నేహా, కొడుకు సూరజ్‌లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రపోతున్న వీరిని దుండగులు కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనలో మిథిలేష్, సియా, నేహా అక్కడికక్కడే చనిపోయారు. సూరజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సూరజ్‌ను ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

3 Family Members Murdered in Delhi

Comments

comments