Home జాతీయ వార్తలు కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం

కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం

3-Justices-Sworn-in-as-Supr

ఢిల్లీ : సుప్రీంకోర్టులో మంగళవారం ముగ్గురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ కెఎం జోసెఫ్‌లు సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు సిజె జస్టిస్ దీపక్ మిశ్రా వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. వీరికి పలువురు జడ్జిలు, సుప్రీంకోర్టు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.