Search
Sunday 23 September 2018
  • :
  • :

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

open-gunfire-in-Los-Angelesలాస్ ఏంజిల్స్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలో వరుస కాల్పుల ఘటనలు చోటుచేసకుంటున్న విషయం విదితమే. తాజాగా లాస్ ఏంజిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం… వెస్ట్ ఆడమ్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరుగుతున్న పార్టీలో మొత్తం 50 మంది ఉండగా, ముగ్గురు బయటకు వెళ్లి ఆయుధాలు తీసుకునివచ్చి ఓ వర్గాన్ని లక్షంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అవతలి వర్గం వారు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఇరు వర్గాల కాల్పులతో కొన్ని క్షణాల వ్యవధిలోనే రెస్టారెంట్ మొత్తం రక్తసిక్తమయిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ నిందితులు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, పోలీసులు ఓ అనుమానిత వ్యక్తితోపాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments